Natyam ad

పుంగనూరులో ఎస్టీలు నిరసన

పుంగనూరు ముచ్చట్లు:

వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు ఏర్పాటు చేసిన నియమించిన కమిటి జీవోను ఉపసంహరించుకోవాలంటు ఎస్టీ సంఘ నాయకులు డాక్టర్‌ బాణావత్‌ మునీంద్రనాయక్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించే సమయంలో నిజమైన ఎస్టీలు హక్కులు కోల్పోయి, వీధినపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహశీల్ధార్‌ వెంకట్రాయులకు వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసనలో ఎస్టీ సంఘ నాయకులు బుక్యాబానుప్రకాష్‌, నాగేనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: STs protest in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.