Natyam ad

పుంగనూరులో ఎస్టీయు క్యాలెండర్లు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:
 
 
ఉపాధ్యాయ ఎస్టీయు సంఘ క్యాలెండర్లను గురువారం సాయంత్రం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ నాగభూషణం కలసి విడుదల చేశారు. ఎస్టీయు సంఘ నాయకులు మురళి, సుబ్రమణ్యం , రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ క్యాలెండర్లను విడుదల చేసి చైర్మన్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఐకమత్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా బోదన పద్దతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, వైస్‌ చైర్మన్‌ నాగేంద్రతో పాటు ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రసాద్‌బాబు, దేవకుమార్‌, వెంకటేశు, రమణ, సుమల తదితరులు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: STU calendars released in Punganur