ఎస్టీయు నూతన కార్యవర్గం ఎన్నిక

STU elects new body

STU elects new body

Date:22/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

మండల కేంద్రంలోని శక్తి భవనంలో శుక్రవారం ఎస్టీయు నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ముఖ్యఅతిధిగా ఎస్టీయు ప్రధాన కార్యదర్శి రమణప్ప మాట్లాడుతూ రామసముద్రం మండలానికి ఎస్టీయు నూతన అధ్యక్షుడుగా అయూబ్‌ఖాన్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మండల ప్రధాన కార్యదర్శిగా సురేష్‌, గౌరవ అధ్యక్షుడుగా రవి తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఇంత పెద్ద పదవిని కట్టబెట్టిన రాష్ట్ర, జిల్లా కమిటి సభ్యుల నమ్మకం వమ్ముకాకుండా ఉపాధ్యాయులు కోసం శాయిశక్తుల న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ఈ మేరకు అయూబ్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి యువరాజ్‌, పరిశీలకులు ప్రభాకర్‌, ఎస్టీయు రాష్ట్ర , జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నక్కబండ ఉర్ధూహైస్కూల్‌గా మార్పు

Tags: STU elects new body

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *