పుంగనూరులో ఘనంగా ఎస్టీయు ఆవిర్భావ దినోత్సవం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎంఅర్సి భవనంలో ఎస్టీయు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎస్టీయు ప్రధాన కార్యదర్శి మోహన్ , హరికిషోర్‌రెడ్డి నిర్వహించారు. గురువారం జెండా ఎగురవేసి వ్యవస్థాపకులు మైనుద్దిన్, విజయరామరాజు, పివి.రాఘవచార్యులకు నివాళులర్పించారు. మోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘం ఏర్పాటై 76 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యల కోసం ఎస్టీయు పోరాటం చేసిందని తెలిపారు. సీపీఎస్ రద్దు, డిఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి, నూతన విద్యావిధానం లోపాలు సరిదిద్ది, అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు అయూబ్‌ఖాన్, లింగమూర్తి, వెంకట్రమణ, శంకర్, రాజేంద్ర, ఆంజనేయులు, ప్రభాకర్ , బుడ్డన్న, మంజునాథ్, అనిల్‌కుమార్ చెంగల్రాయచారి, సుబ్రమణ్యం, ఖాదర్‌బాషా, దీపారాణి, పద్మజ, సంధ్యరాణి, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Tags: STU Emergence Day in Punganur
