విద్యార్ధి మృతదేహం లభ్యం

విశాఖపట్నం  ముచ్చట్లు:
గోపాలపట్నం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం లభ్యమైంది.  పెందుర్తి రామ్నగర్ సమీపంలోని వెంకటపతిరాజునగర్కు చెందిన చెంబు కోటేశ్వరరావు, నాగమణి దంపతులకు భరత్, ప్రశాంత్కుమార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ప్రశాంత్ కుమార్ స్థానిక నరవలోని విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. నరవలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అతను గురువారం మధ్యాహ్నం స్నేహితులతో పాటు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్కు ఈతకు వెళ్లాడు. స్నేహితులు రిజర్వాయర్లో ఈతకొడుతుండగా ప్రశాంత్కుమార్కు ఈత రాకపోవడంతో రిజర్వాయర్ స్పిల్వే వద్ద ఉన్న రెయిలింగ్ పట్టుకుని మెట్లపై కూర్చున్నాడు. ఇంతలో పట్టుజారి రిజర్వాయర్లో పడి మునిగిపోయాడు. సమీపంలో ఉన్న ఈతగాళ్లు అతని కోసం వెతికినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.అయితే విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.కన్న కొడుకు మృతి చెదటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Student body available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *