పుంగనూరులో తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

పుంగనూరు ముచ్చట్లు:
 
పాఠశాలకు వెళ్లమని తండ్రి మందలించడంతో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జరిగింది. పట్టణంలోని ప్రకాశం కాలనీలో నివాసం ఉన్న మహేష్‌ కుమారుడు యశ్వంత్‌సాయి(13)సదుం గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవులు పూర్తికావడంతో శనివారం తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లమని యశ్వంత్‌సాయికి తెలిపారు. అతడు స్కూల్‌కు వెళ్లనని చెప్పడంతో తల్లిదండ్రులు మందలించారు. దీనిపై మనస్థాపానికి గురైన యశ్వంత్‌సాయి ఇంట్లో రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించేలోపే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Student commits suicide in Punganur

Natyam ad