ఉరి వేసుకుని విద్యార్థి మృతి

Date:25/01/2020

అవనిగడ్డ  ముచ్చట్లు:

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది.  జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు.  తమ్మనబోయిన దీపక్ మణికంఠ సాయి(15)గా స్థానికులు గుర్తించారు. శుక్రవారం రాత్రి ప్రైవేటు ట్యూషన్ కు వెళ్లిన దీపక్ తెల్లారేసరికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.  అయితే మణికంఠది హత్యా? ఆత్మహత్యా అన్నది తేలాల్సి ఉంది.
అనుమానాస్పద మృతిగా ఘంటసాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది

Tags: Student killed by hanging

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *