పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ట్రిపుల్ ఐటీ కి ఎంపిక

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రెడ్డి రాహుల్ ఈ సంవత్సరం త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయులు షంషీర్ గారు తెలియజేశారు ఈ పాఠశాల నుండి ఒక విద్యార్థి ట్రిపుల్ ఐటీ కి ఎంపిక కావడం వెనుక ఉపాధ్యాయులు కృషి చాలా ఉందని తెలియజేశారు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు మొదటి నుంచి ప్రోత్సహిస్తూ అండగా ఉన్నారని వారికి విద్యార్థికి ప్రధానోపాధ్యాయులు గారు అభినందనలు తెలియజేశారు.
గత రెండు సంవత్సరాల నుంచి పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి అనేకమంది విద్యార్థులు NMMS స్కాలర్షిప్స్ కు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కి ఎంపిక కావడం సంతోషదాయకంని తెలియజేశారు.
అంతేకాక ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ఉన్నత పాఠశాల పలమనేరు సీబీఎస్సీ పాఠశాలగా ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలలలో చిత్తూరు జిల్లాలో సీబీఎస్ఈ పాఠశాలగా ఎంపికైన ఏకైక పాఠశాల పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల అని ఈ అవకాశాన్ని పలమనేరులో ఉన్న తల్లిదండ్రులు వినియోగించుకుని తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్చాలని ఆయన తెలియజేశారుపలమనేర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలకు కూడా ప్రవేశాలు ఉన్నాయని ప్రత్యేకంగా తెలియజేశారు. అంతేగాక పీఎం శ్రీ పథకానికి కూడా ఈ పాఠశాల ఎంపికైందని తెలియజేశారు ఈ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ మరియు NCC అందుబాటులో ఉందని తెలియజేశారు.

 

Tags: Student of Palamaneru Government High School selected for Triple IT

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *