ఫిబ్రవరి 9న విద్యార్థుల సక్సెస్ మీట్

– వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచినవారికి అఛీవర్ అవార్డులు

 

తిరుమల ముచ్చట్లు:

 

టీటీడీ విద్యాసంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించి అఛీవర్ అవార్డులు ప్రదానం చేసేందుకు ఫిబ్రవరి 9వ తేదీ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియంలో విద్యార్థుల‌ సక్సెస్ మీట్ జ‌రుగ‌నుంది.       టీటీడీ విద్యాసంస్థల్లో అకడమిక్స్, ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో కరికులర్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 240 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా 5 గ్రాముల వెండి డాల‌ర్‌, ప్రశంసాపత్రం అందజేస్తారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు టీటీడీ విద్యాసంస్థలు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుండడం విశేషం. విద్యాశాఖ అధికారి డా.ఎం.భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

Tags:Student Success Meet on 9th February

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *