నెల్లూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిలోకి రాకముందు చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తానని మాట తప్పారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మంత్రుల ఇళ్ల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ యువ నాయకులు, కాంగ్రెస్ అనుబంధం ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు నెల్లూరు లోని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. డీఎస్సీలో కేవలం 6000 ఉద్యోగాలు వచ్చేటట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేశారని కానీ మిగిలిన వేలమంది యువత పరిస్థితి ఏంటని, వాలంటీర్లకు 5000 రూపాయలు డబ్బులు ఇస్తూ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని కల్లబొల్లి మాటలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు వీరి ముట్టడి ప్రయత్నాన్ని భగ్నం చేసి అరెస్టు చేశారు.
Tags: Student unions besieged Minister Kakani’s house