విద్యార్థులు వింత వ్యాధి

డెహ్రాడూన్ ముచ్చట్లు:

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.  గత రెండు రోజులుగా ఆ స్కూల్ లోని విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. స్టూడెంట్స్ అరుస్తూ, ఏడుస్తూ వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని విద్యాశాఖను ఉల్కిపడేలా చేసింది. బాగేశ్వర్‌లోని మారుమూల గ్రామం రైఖులీలో హైస్కూల్ లో అడ్మినిస్ట్రేషన్, వైద్యుల బృందం సందర్శించింది. విద్యార్థినులు అరుస్తూ, ఏడుస్తూ, అసాధారణ ప్రవర్తన నేపథ్యంలో ఆ గ్రామాన్ని సందర్శించి సరిగ్గా ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇదే విషయంపై జూనియర్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు విమలా దేవి మాట్లాడుతూ.. మంగళవారం(జూన్ 26వ తేదీ)   కొంతమంది బాలికలతో పాటు ఒక బాలుడు విలక్షణమైన రీతిలో ప్రవర్తించారని.. అప్పుడు తాము విద్యార్థులలో ‘అసాధారణ’ చర్య మొదటిసారిగా  గుర్తించినట్లు పేర్కొన్నారు.“స్టూడెంట్స్ ఏడ్చారు, అరుస్తున్నారు, వణుకుతున్నారు.. కారణం లేకుండా తలలు కొట్టుకోవడానికి కూడా ప్రయత్నించారని చెప్పారు విమలాదేవి . తాము వెంటనే  తల్లిదండ్రులను పిలిపించామని..  వారు స్థానిక పూజారిని పిలిపించారని..

 

 

అప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది” అని ఉపాధ్యాయురాలు విమ్లా దేవి చెప్పారు.ఈ ఘటన గురువారం మరోసారి పునరావృతమైందని ఆమె అన్నారు. “డిపార్ట్‌మెంటల్ అధికారులు స్కూల్ లో ఉన్న సమయంలో కొంతమంది విద్యార్థులు అదే విధంగా ప్రవర్తించారు. పాఠశాల ఆవరణలోనే పూజ చేయాలని తల్లిదండ్రులు పట్టుబట్టారు. పాఠశాలలో ఏదో జరుగుతుందని తల్లిదండ్రులు నమ్ముతున్నట్లు ఉపాధ్యాయులు చెప్పారు. “అయితే తాము మేము వైద్యులను సంప్రదించి.. వైద్య సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు.విద్యార్థులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయంపై స్పష్టంగా తెలియదని చెప్పారు. అయితే, ఫిజియాట్రిస్ట్‌లు ఇది ‘మాస్ హిస్టీరియా’ కేసుగా అనుమానిస్తున్నారు. ఇలాంటి కేసులను ‘మాస్ హిస్టీరియా’గా పేర్కొనవచ్చని బగేశ్వర్‌లోని జిల్లా పంచాయతీ సభ్యుడు చందన్ రావత్ చెప్పారు. జిల్లాలోని మరికొన్ని పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

 

Tags: Students are a strange disease

Leave A Reply

Your email address will not be published.