విద్యార్ధులు హరిత ప్రతినిధులు

Students are green representatives

Students are green representatives

Date:24/11/2018
అమరావతి ముచ్చట్లు:
పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులే స్వచ్ఛంద గ్రీనరీ అంబాసిడర్లని మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.  శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు సచివాలయంలోని రెండో బ్లాక్ లో మంత్రి కి  మొక్కలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్ధులు  తమ తల్లీదండ్రులతోనూ, బంధువులతోనూ మొక్కలు నాటే విధంగా చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రస్తుత ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ఉపయోగాలపై వెస్ట్ బెర్రీ విద్యార్థులకు అవగాహన కలిగి ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు, డైరెక్టర్ మహేష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags:Students are green representatives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *