చెస్ క్లబ్ ఛాంపియన్స్ కు విద్యార్థులు ఎంపిక
పుంగనూరు ముచ్చట్లు:
గురుకులం చెస్ క్లబ్ ఛాంపియన్స్ కె ప్రణవి, 10వ తరగతి, బి బిందుప్రియ, 9వ తరగతి, బి హనీష, 7వ తరగతి బాలికోన్నత పాఠశాల పుంగనూరు మరియు కె వినయ్ కుమార్, 8వ తరగతి కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ఈనెల 28 మరియు 29వ తేదీల్లో భీమవరంలో జరిగే అంతర్జాతీయ ఫిడె టోర్నమెంటు లో పాల్గొనబోతున్నారు. ఈ టోర్నమెంటు తర్వాత వీరందరికీ అంతర్జాతీయ ప్రోఫెషనల్ చెస్ ప్లేయర్ హోదా మరియు ఐడి లభిస్తుంది. వీరి ప్రొఫైల్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడె వెబ్సైట్ లో కూడా చేర్చబడుతుంది. మన పట్టణంలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ఘనత సాదించడం మనందరి గర్వకారణం అని, వీరందరూ టోర్నమెంటు లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఫిడె రేటింగ్ మరియు ర్యాంకింగులతో తిరిగిరావాలని గురుకులం ఆచార్య మణికంఠ కామాటం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయబృందం మరియు తల్లిదండ్రులు కోరారు.

Tags; Students are selected for Chess Club Champions
