విద్యార్ధులు తీవ్రవాదులా..నిరసన తెలిపితే యావజ్జీవం విధిస్తారా..

– హక్కుల కోసం పోరాడితే అడ్డగోలు బ్లాక్ మేయిల్ చేస్తున్న కేంద్రం
మన దేశ నినాదం, విధానం జై జవాన్ జైకిసాన్.. నేడు వారికే దేశంలో రక్షణ లేదు
– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట ముచ్చట్లు:

విద్యార్ధులు తీవ్రవాదులా..నిరసన తెలిపితే యావజ్జీవం విధిస్తారా. – హక్కుల కోసం పోరాడితే అడ్డగోలు బ్లాక్ మేయిల్  కేంద్రం చేస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.  మన దేశ నినాదం, విధానం జై జవాన్ జైకిసాన్.. నేడు వారికే దేశంలో రక్షణ లేదు.  సైనికులు బీజేపీ సెక్యురిటీ గార్డుల్లా ఉండాలట.. బట్టలు ఉతకాలట.  బీజేపీ నేతల బలుపు మాటలు.. దేశ ప్రతిష్ట దిగజార్చుతున్న బీజేపని అయన విమర్శించారు.  2018 లో శాశ్వత ప్రాతిపదికన ఎంపికైన ఆర్మి అభ్యర్థులకు నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన “అగ్నిపథ్” ఎలా వర్తిస్తుంది.. అది తప్పని నిరసిస్తే నిరుద్యోగుల ప్రాణాలు తీసారు.. వారేమన్నా తీవ్రవాదులా.. లేక గోద్రా అల్లర్లు  చేసి ఊచ కోత కోసారా..?  ఊచకోతలు కోసిన వాళ్ళే దేశాలనేలుతున్నారు.. అలాంటిది తమ హక్కులను కాలరాయకండి అని నిరసిస్తే వారి జీవితాలు నాశనం చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది.  దేశానికి అన్నం పెట్టే రైతన్నను చంపారు.. దేశానికి రక్షణగా ఉండే ఆర్మీ జవాన్ లను చంపారు.  దేశ రక్షణ వ్యవస్థ అంటే ఆర్మీ.. అంటే దేశంలో గొప్పగౌరవం.. సైనికులంటే దేశ వ్యాప్తంగా దేశాన్ని కాపాడే దేవుల్లుగా కొలుస్తారు. అలాంటి వారిని అవమానిస్తే పుట్టగతులుండవు.  అగ్నిపథ్ లో చేరిన వాళ్లను తర్వాత తమ బీజేపీ ఆఫీసుల్లో గార్డులుగా పెట్టుకుంటామని మద్యప్రదేశ్ బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ అన్నాడు.. అగ్నిపథ్ అయిపోయాక కటింగ్ చేయచ్చు, ఇస్త్రీ చేయచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటాడు.. అసలు సిగ్గుండే ఈ మాట మాట్లాడుతున్నారా.. దేశ సైనికులంటే మీ ఆఫీసుల ముందు గార్డుల్లా పనిచేయాలా..? ఇదా దేశం కోసం సేవ చేసిన వారికిచ్చే గౌరవం..దేశం మీకు అవకాశమిస్తే అహంకారం నెత్తికెక్కి ఇలాంటి చిల్లర కూతలు కూస్తున్నారని అన్నారు.

 

 

Post Midle

నల్ల చట్టాలు తీసుకొచ్చి చేనులో వ్యవసాయం చేయాల్సిన రైతును ఏడాది పాటు ఎండా, వానలో పోరాటం చేసేలా చేసి వారి ప్రాణాలు తీసారు. చివరకు తప్పని తెలిసి జనం మొహం మీద ఉమ్మితే తోకముడిచి క్షమాపణ చెప్పి నల్లచట్టాలు వెనక్కి తీసుకున్నారు.. – నేడు అదే పంథాలో దేశానికి రక్షణ ఇవ్వాల్సిన సైనికులను రోడ్డు మీదకు లాగి వారి ప్రాణాలు తీస్తున్నారు.. అగ్నిపథ్ రద్దు చేసి మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలి.  మన దేశ నినాదం జై జవాన్.. జైకిసాన్… మన దేశం అమితంగా గౌరవించేది పూజించేది దేశానికి అన్నం పెట్టే రైతన్నను, దేశానికి రక్షననిచ్చే సైనికుడిని.. కానీ బీజేపీ రైతులు, సైనికుల ప్రాణాలు తీస్తు వారి ఉసురు పోసుకుంటుంది.. నాడు రైతులను చంపిర్రు నేడు జవాన్ లను చంపిర్రు దేశాన్ని పాలించే నైతికత బీజేపీకి ఉందా..?  దేశ సంపదనంతా అంబాని ఆదానిలకు అప్పజెపుతూ, రైతుల నడ్డి విరుస్తూ, జవాన్ల ప్రాణాలు తీస్తూ, పేదల పొట్టగొట్టేలా దరలు పెంచుతూ, దేశాన్ని దరిద్రంలోకి నెట్టేస్తున్న దగుల్బాజీ పార్టీ బీజేపీ.. వీళ్ళకు సిగ్గుంటే అగ్నిపథ్ ను రద్దు చేయాలని అయన అన్నారు.

 

Tags: Students are terrorists..will they be sentenced to life imprisonment if they protest ..

Post Midle
Natyam ad