పర్యావరణం రక్షణకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు

Students are the brand ambassadors for environment protection

Students are the brand ambassadors for environment protection

Date:27/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
స్కూలు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లుగా నాలుగో విడత తెలంగాణకు హరితహారం నిర్వహించాలని అటవీ శాఖతో పాటు భాగస్వామ్య శాఖలు, స్వచ్చంద సంస్థలు నిర్ణయించాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలు హరిత ప్రాంగణాలుగా మారాలని, వాటిల్లో చదివే విద్యార్ధినీ, విద్యార్థులు హరిత వారధులుగా పనిచేయాలనే ముఖ్యమంత్రి  ఆకాంక్షను అమల్లో పెట్టాలని ఆయా శాఖల అధికారులు అభిప్రాయపడ్డారు. నాలుగో విడత హరితహారం అమలు, సన్నాహకాల్లో భాగంగా విద్యాశాఖ, నేషనల్ గ్రీన్ కార్ప్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆయుష్ అధికారులతో పాటు ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సీ.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. హరితహారంలో  విద్యాశాఖ, స్కూళ్ల గత మూడేళ్ల భాగస్వామ్యం, రానున్న సీజన్ లో  మరింత సమర్థవంతంగా అమలుపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని ప్రతీ విద్యా సంస్థ ఒక హరిత ప్రాంగణంగా మారాలని, వాటిల్లోని విద్యార్థులు హరిత అంబాసిడర్లుగా పనిచేసేలా ప్రోత్సహించేలా కార్యాచరణ ఉండాలని నిర్ణయించారు. బంగారు తెలంగాణ కోసం బాలల హరితహారం పేరుతో నాలుగో విడతలో విసృతంగా మొక్కలు నాటడం, రక్షణ బాధ్యతలు విద్యార్థులు, టీచర్లు తీసుకునేలా ప్రణాళిక రూపొందించనున్నారు. త్వరలోనే విద్యాశాఖతో సమన్వయంతో డీఈఓ నుంచి హెడ్ మాస్టర్, టీచర్ స్థాయి దాకా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహనా కార్యక్రమం నిర్వహించాలని, మన టీవీ ప్రసారాల ద్వారా అన్ని స్కూళ్లకు  హరితహారం, పర్యావరణ రక్షణ ఉద్దేశ్యాలు నేరుగా చేరేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈసమావేశంలో ఈ క్రింది అంశాలు చర్చించారు.
-ప్రతీ హై స్కూళ్లో ఆరు నుంచి పదోతరగతి విద్యార్థినీ, విద్యార్థులను హరితహారంలో భాగం చేయటం.
-వారంలో ఒక రోజు ఖచ్చితంగా మొక్కల సంరక్షణకు కేటాయించేలా బాథ్యతలు.
-స్కూళ్ల వారీగా హరిత రక్షక దళం (గ్రీన్ బ్రిగేడ్) ఏర్పాటు, టీచర్ల పర్యవేక్షణ.
-విద్యార్ధులు మొక్కలను దత్తత తీసుకోనేలా ప్రోత్సహించటం.
-పుట్టిన రోజుకు గుర్తుగా మొక్క నాటించటం, దాని సంరక్షణ బాధ్యత అప్పచెప్పటం.
-వృక్ష రక్షా బంధన్ లాంటి వినూత్న కార్యక్రమాలకు ప్రోత్సాహం.
-నేచర్ క్లబ్ లను ఏర్పాటు చేసి పర్యావరణం, ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన.
-ప్రతీ స్కూలు ప్రాంగణంలో కొన్ని ఔషధ మొక్కలు పెంచి, వాటి ప్రాధాన్యత తెలిసేలా చేయటం.
-పచ్చదనం కోసం పాటుపడే విద్యార్థుల, టీచర్లకు ప్రోత్సాహకం, అదనపు మార్కులపై దృష్టి.
-స్కూలు నుంచి ఇంటికి వెళ్లే ప్రతీ విద్యార్థి ఒక గ్రీన్ మెసెంజర్ (హరిత వారధులు)గా తీర్చిదిద్దటం.
ఈ సమీక్షా సమావేశంలో సీ.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్  పీ.కే.ఝా, పీసీసీఎఫ్ (ఐ.టీ) రఘవీర్, ఫారెస్ట్ అకాడమీ సంచాలకులు కోట. తిరుపతయ్య, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుజాత, ఆయుష్, మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ అధికారులతో పాటు నేషనల్ గ్రీన్ కార్ప్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్(wwf), కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివొల్యూషన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:Students are the brand ambassadors for environment protection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *