విద్యార్దుల అందోళన
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో విద్యార్ధులు ఆందోళనకు దిగా రు.ఏయూ పరిదిలో ఉన్న కళాశాలలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని అదికారుల నిర్ణయాన్ని వ్యతి రేకిస్తూ ఛలో ఏయూకి ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. దీంతో భారీగా తరలివచ్చిన విద్యార్ధులు ఏయూ గేట్ వద్ద ధర్నాకు దిగారు.50 శాతంపైగా సిలబస్ పూర్తి కాకుండానే విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తే నష్టపో యే ప్రమాదం ఉందని తెలిసినా అదికారులు ఆదేశాలు జారీ చెయ్యడంపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే పరీక్షలను వాయిదా వెయ్యాలని డిమాండ్ చేశారు.

Tags: Students concerns
