Natyam ad

పుంగనూరులో ఈతలకు వెళ్లే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి- సుబ్బరాజు

పుంగనూరు ముచ్చట్లు:

వేసవిలో ఈతలకు వెళ్లే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఈతకొట్టడం అలవర్చుకోవాలని ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక అగ్నిమాపక కేంద్రంలో విద్యార్థులకు ప్రమాదాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈతకు వెళ్లే వారు తాడు , బెండ్లు, ట్యూబ్‌లు కట్టుకుని పెద్దల పర్యవేక్షణలో ఈతలు కొట్టాలన్నారు. ఒక వేళ ప్రమాదవశాత్తు పిల్లలు మునిగిపోయినా తక్షణమే వారిని బయటకు తీసుకు తలక్రిందులుగా పట్టుకోవడం, కడుపుపై ఒత్తడంతో నీరు బయటకు వచ్చి పిల్లలకు ముప్పులేకుండ ఉంటుందన్నారు. ఈ విషయాలపై ప్రయోగం చేసి చూపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తగిన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Students going swimming in Punganur should take care – Subbaraju

 

Post Midle