విద్యార్ధులు డ్యూయల్ డిగ్రీ…

Date:23/05/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కమిషన్‌ ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.ఇకపై దేశంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు రెండు డిగ్రీ కోర్సులు కలిపి ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. అయితే రెండూ ఒకేసారి రెగ్యులర్‌ కోర్సులుగా ఉండేందుకు అనుమతి ఉండదు. సాధారణ కళాశాల తరగతుల్లో రెగ్యులర్‌గా ఒక కోర్సు, మరొకటి ఆన్‌లైన్లో దూరవిద్య(ఓఎల్‌డీ) ద్వారా చదువుకునే అవకాశం ఉంటుంది.
ఎందుకీ నిర్ణయం..యూజీసీ ఏం చెప్పింది:

 

 

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పోటీని ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.
కొత్త విధానంలో విద్యార్థులు ఒకే సంస్థ లేదా వేర్వేరు సంస్థల ద్వారా ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను అభ్యసించగలుగుతారు.దీనికి సంబంధించి త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.
ఏక కాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు 2012లోనే యూజీసీ ముందుకువచ్చింది.
ఈ ప్రతిపాదనను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి వైస్‌ చాన్స్‌లర్‌ నేతృత్వంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించింది.రెగ్యులర్‌ విధానం కింద డిగ్రీలో చేరిన విద్యార్థి, అదే సమయంలో ఓపెన్‌ లేదా డిస్టెన్స్‌ విధానంలో గరిష్టంగా ఒక అదనపు డిగ్రీ చేయడానికి అనుమతించవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. రెగ్యులర్‌ మోడ్‌లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమతించడానికి పాలనా పరంగా వీలుకాదని అభిప్రాయపడింది.ప్రస్తుతం మారుతున్న ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు, పెరుగుతున్న పోటీతత్వంతో విద్యార్థులు వాటిని ఎదుర్కొనాలంటే మరింత పరిజ్ఞానం అవసరమని భావించి ఒకేసారి రెండు డిగ్రీలకు అవకాశం కల్పించింది.దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థి రెండు డిగ్రీలు ఏక కాలంలో చదవొచ్చు

సీజ్ చేసిన వాహానాలు రిలీజ్

Tags: Students have a dual degree …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *