Students must achieve high standards with discipline

విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నతశిఖరాలు సాధించాలి

– డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నతశిఖరాలు అధిరోహించాలని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అకాడమిలో పదోతరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశంతో పాటు సరస్వతి పూజా కార్యక్రమాన్ని, తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రిన్సిపాల్‌ మంజులరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి విద్యార్థులు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాఠశాల ఒక్కసారిగా భక్తిపారవశ్యమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చంద్రమోహన్‌రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ విలువైన కాలాన్ని అధికబాగం సెల్‌ఫోన్లకు, సోషియల్‌ మీడియాను పరిశీలించేందుకే కేటాయిస్తున్నారని , ఇలాంటి వాటికి స్వస్తి పలకాలన్నారు. పదోతరగతి విద్యార్థులు పాఠ్యాంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని పరీక్షలు రాయాలన్నారు. నిర్లక్ష్యం, తొందరపాటుతో పరీక్షలు రాయరాదని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోను చూసి రాయడం, కాపీకొట్టే ప్రయత్నాలు చేయరాదని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు ఇతర పిల్లలతో పోల్చుకుని బాగుండాలని పోటీలతో టీవిలు, సెల్‌ఫోన్లు, వాహనాలు కొనుగోలు చే సి ఇవ్వడం శ్రేయస్కరం కాదన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో విద్యా సంబంధమైన విషయాలపై ప్రతి రోజు చర్చించుకోవాలన్నారు. పిల్లలకు ఇష్టమైన విద్యనే చదివించాలని, బలవంతపు విద్యను చేపట్టరాదని సూచించారు. ఇంటర్మీడియట్‌లోపు చదువుతున్న విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు చదువు పట్ల దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. హాంగులు, ఆర్భాటాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమౌతుందని తెలిపారు. విలాసాలకు అలవాటు పడ్డ విద్యార్థులకు శ్రమించడం కష్టతరమౌతుందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన మేరకు మాత్రమే సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల లెక్చరర్‌ నందీశ్వరయ్య,విశ్రాంత తహశీల్ధార్‌ రెడ్డెప్పరాజు, విశ్రాంత లెక్చరర్‌ రెడ్డెప్పరెడ్డితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

 

విద్యార్థులు అబ్ధుల్‌కలామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

Tags: Students must achieve high standards with discipline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *