విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి

Students must participate in service activities

Students must participate in service activities

Date:11/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని , ప్రజలకు చేదోడుగా నిలవాలని ప్రిన్సిపాల్‌ క్రిష్ణమూర్తి కోరారు. గురువారం శుభారాం డిగ్రీ కళాశాల ఎన్‌ఎఎస్‌ఎస్‌ విద్యార్థులతో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా డాక్టర్‌ ప్రభాకర్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. సకాలంలో నాణ్యమైన ఆహారం తీసుకుని , సెల్‌ఫోన్లు, ఇంటర్నేట్‌ల వినియోగం తగ్గించాలన్నారు.అలాగే ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. రక్తదానం చేయడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండదని, అపోహాలు తొలగించుకోవాలన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా విద్యార్థులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు నందీశ్వరయ్య, ఆంజనేయులురెడ్డి, షమ్స్అక్తర్‌ , రాఘవరెడ్డి, రాబర్ట్, సుధాకర్‌రెడ్డి, సాదత్‌అలిబేగ్‌, విజయ శ్రీ, శ్రీనివాసులు, మాదవి, రమణారెడ్డి, శ్చి్ప తదితరులు పాల్గొన్నారు.

12న కోర్టుల విధులు బహిష్కరణ

Tags: Students must participate in service activities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *