చండ్రమాకులపల్లె విద్యార్థులు త్రోబాల్ విజేతలు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని చండ్రమాకులపల్లె హైస్కూల్‌లోని విద్యార్థులు నియోజకవర్గ స్థాయి త్రోబాల్ పోటీల్లో గెలుపొందారు. బుధవారం పీడీ మురళిధర్ మాట్లాడుతూ సోమల మండలం కందూరులో జరిగిన జోనల్‌పోటీల్లో విద్యార్థులు త్రోబాల్‌లో విజేతలుగా నిలిచారని తెలిపారు. వీరిని హెచ్‌ఎం శ్రీదేవి, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, స్కూల్ కమిటి చైర్మన్ భరత్ రెడ్డిలు ప్రశంసించారు.

Tags: Students of Chandramakulapalle were the throwball winners
