శిల్ప క‌ళాశాల విద్యార్థులు క‌ళానైపుణ్యాలు పెంచుకోవాలి -టిటిడి న్యాయాధికారి   రెడ్డెప్ప‌రెడ్డి

తిరుప‌తి ముచ్చట్లు:

 

శిల్ప క‌ళాశాల విద్యార్థులు ఇలాంటి వ‌ర్క్‌షాప్‌ల ద్వారా క‌ళానైపుణ్యాల‌ను పెంపొందించుకుని రాణించాల‌ని టిటిడి న్యాయాధికారి   రెడ్డెప్ప‌రెడ్డి కోరారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర సంప్ర‌దాయ ఆల‌య శిల్ప శిక్ష‌ణ సంస్థలో సంప్ర‌దాయ శిల్ప‌క‌ళ – అనుబంధ అంశాల‌పై మూడు రోజుల పాటు జ‌రిగిన వ‌ర్క్‌షాప్ శుక్ర‌వారం ముగిసింది.ముగింపు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెడ్డెప్ప‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఇలాంటి వ‌ర్క్‌షాప్‌లు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు. భార‌త‌దేశం క‌ళ‌ల కాణాచి అని, ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఆల‌యాల్లో అపార‌మైన శిల్ప‌క‌ళ ఉంద‌ని చెప్పారు. ప‌ల్ల‌వులు, చోళులు, విజ‌య‌న‌గ‌ర రాజుల కాలంలో అమూల్య‌మైన శిల్ప సంప‌ద ల‌భించింద‌న్నారు. అంత‌రించిపోతున్న శిల్ప‌క‌ళ‌ను భావిత‌రాల‌కు అందిస్తున్న శిల్ప‌క‌ళా నిపుణుల‌ను అభినందించారు.కాగా, చివ‌రిరోజు ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు తిరుపతికి చెందిన శ్రీ కిర‌ణ్‌క్రాంత్ చౌద‌రి భార‌తీయ ప్ర‌తిమ‌ల‌ చ‌రిత్ర, ఉదయం 11.45 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వ‌ర‌కు హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత స్థ‌ప‌తి డాక్టర్ వేలు దక్షిణ భారతదేశ ఆలయాల్లో ప్రసాద ల‌క్ష‌ణం, మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు కోయంబత్తూరుకు చెందిన స్థ‌ప‌తి శ్రీ టి.సెల్వం సుధా శిల్పాల తయారీ విధానం, టిటిడి అసిస్టెంట్ స్థ‌ప‌తి ఐవి.కృష్ణారావు ఆలయ జీర్ణోద్ధ‌ర‌ణ‌, నిర్మాణానికి అంచ‌నాల‌ త‌యారీ అంశాలపై ప్ర‌సంగించారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డిఈవో  గోవిందరాజన్, శ్వేత సంచాల‌కులు, క‌ళాశాల ప్ర‌త్యేకాధికారి శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, ప్రిన్సిపాల్  వెంకట రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags: Students of Shilpa Kalasha should improve their artistic skills – TTD Magistrate Reddeppa Reddy

Leave A Reply

Your email address will not be published.