ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్న విద్యార్థులు

Date:23/09/2020

ఆదిలాబాద్ ముచ్చట్లు

కరోనా వేళా ఆదిలాబాద్ జిల్లా లో పలుచోట్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రవేట్ విద్య సంస్థ ల నుండి తీసివేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు ప్రవేట్ విద్యా సంస్థలకు ఫీజులు కట్ట లేక ఉచితంగా ఆన్ లైన్ క్లాసులు అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారు.. జిల్లా లోని నెరడిగొండ మండలం వెంకటాపుర్ గ్రామానికి చెందిన రైతులు ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని  ఆన్లైన్ క్లాసులు నుర్వాహిస్తున్నామని చెపుతూ  బుక్స్ కూడా ఇస్తామని మాయమాటలు చెప్పి ప్రవేట్ విద్య సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. మండలం లోని తేజపూర్ లో ప్రభుత్వ ప్రాథమిక ఇంగ్లీష్ మీడియం పాటశాల లో ప్రైవేట్ కు ధీటుగా ఆన్లైన్ పాటలు చెప్పడం విద్యార్థులకు వాట్సాప్ ద్వారా సమాచారం చెర వేస్తూ  పాఠాలు నేర్పించడం వెంకటాపుర్ గ్రామస్తులకు నచ్చడం తేజపూర్ పాఠశాల ప్రదనోపాధ్యాయుడు రమేష్ స్వయం గా గ్రామానికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రుల తో సంప్రదించి 40మంది విద్యార్థుల ను పాఠశాలలో చేర్పించారు.    ప్రభుత్వం నుండి పాఠశాలకు టాటా మేజిక్ ఆటో మంజూర్ కావడం.. సుమారు 8 కిలో మీటర్ల  దూరంలో ఉన్న  గ్రామానికి  వాహన సౌకర్యం కల్పిస్తామని  బుక్స్ యూనిఫామ్ లు ఉచితంగా ఇస్తామని   చెప్పడంతో  వెంకటాపూర్ గ్రామస్థులు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని తమ గ్రామం లోని పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి నిర్ణయించారు.

లక్ష్యాలను అధిగమించెందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం

Tags:Students queuing for public schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *