పుంగనూరులో త్రోబాల్ జట్టుకు విద్యార్థులు ఎంపిక
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని చండ్రమాకులపల్లె జెడ్పి హైస్కూల్ విద్యార్థులు గాయిత్రి, వంశికృష్ణ లు రాష్ట్ర స్థాయి అండర్ -17 త్రోబాల్ పోటీలకు ఎంపికైనట్లు పీఈటి మురళిధర్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన వంశికృష్ణ, గాయిత్రిలు నవంబర్ నెలలో నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరపున ఎంపికైయ్యారని తెలిపారు. క్రీడాకారులను హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు జ్యోతి, వెంకట్రమణారెడ్డి తదితరులు అభినందించారు.

Tags: Students selected for throwball team in Punganur
