వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

పుంగనూరు ముచ్చట్లు:

సంక్షేమ హాస్టల్‌ల్లోని విద్యార్థులు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ జయేష్‌ సూచించారు. బుధవారం స్థానిక గిరిజన సంక్షేమ హాస్టల్‌లో ఆయన వైద్య శిబిరం నిర్వహించి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. డాక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో సికిల్‌సెల్‌ ఎనీమియాపై అవగాహన కల్పించారు. ఆనారోగ్యానికి గురైన వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్సలు చేసుకోవాలన్నారు. నిర్లక్షం చేయరాదని సూచించారు. ఈ విషయాలలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు కూడ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags: Students should be alert for diseases

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *