Natyam ad

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి- న్యాయమూర్తి వాసుదేవరావు

పుంగనూరు ముచ్చట్లు:

 

విద్యార్థులు చట్టాలపై అవగాహన క లిగి , భవిషత్తు తరాలకు మార్గదర్శకం కావాలని సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని హైస్కూల్‌లో బాలల దినోత్సవం సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సును ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలసి కేక్‌ కట్‌ చేసి , విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపైన , సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకుని, క్రమశిక్షణతో విద్యావంతులుకావాలన్నారు. క్రమశిక్షణ లేని విద్యకు గుర్తింపు ఉండదన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదివి, సమాజానికి సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, హెచ్‌ఎం సుబ్రమణ్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Students should be aware of laws- Justice Vasudeva Rao

Post Midle

Leave A Reply

Your email address will not be published.