విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలి

Date:13/04/2018

నూనె వారి పల్లి ముచ్చట్లు:

పలమనేరు రూరల్ మండలం సముద్ర పల్లె గ్రామ పంచాయితీ లోని నూనె వారి పల్లి పాఠశాలలో శుక్రవారం జరిగిన వార్సికోత్సవ సభలో రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి వర్యులు శ్రీ ఎన్. అమరనాథ రెడ్డి గారి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డిగారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. పిల్లల అభివృద్ధి కోసం తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గవర్నమెంట్ పాఠశాలలోని పిల్లలు చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు అని, కావున అందరూ కూడా బాగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె అన్నారు. అనంతరం పాఠశాలలోని గ్రంథాలయానికి ఆంగ్ల మాధ్యమ కథల పుస్తకాలను విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు,ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్ప, ఉపాద్యాయ బృందం, స్థానిక సర్పంచ్ విజయ్ కుమార్,విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags: Students should be honest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *