Natyam ad

విద్యార్దులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలి

హైదరాబాద్ ముచ్చట్లు:

ట్రాఫిక్ ఫరిష్తే ఫెలిసిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా పలువురు ట్రాఫిక్ వాలైంటీర్స్ కి సర్టిఫికేట్ తో పాటు జ్ఞాపికలను హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి అందచేసారు.
సీపీ మాట్లాడుతూ మిగిలిన మెట్రో సిటీలో ఎలా ట్రాఫిక్ ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది.కానీ కొన్ని ఇతర ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్ లో ఉన్నాయి… రోడ్స్ ఇరుకుగా ఉండటం కారణం. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందికి 30% అదనంగా అలవెన్స్ ఇవ్వడం అనేది మంచి పరిణామం… వేరే రాష్ట్రాలలో ట్రాఫిక్ సిబ్బందికి అదనపు అలవెన్స్ ఇవ్వడం లేదని అన్నారు.
ట్రాఫిక్ అనేది ఆగకుండా ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటే ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుంది. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పుల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడితే, దానిని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నం అవుతున్నాం. తప్పు చేసిన వారికి చలాన్ వేయడం ఒకటే కాకుండా ట్రాఫిక్ నీ కంట్రోల్ చేయడం ముఖ్యం. చాలా మంది ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ లో ఫీల్డ్ లో తిరుగుతూనే వాహనంలో భోజనం చేస్తున్నారని అన్నారు.
పీక్ అవర్ లో ఛలాన్ వేస్తూ వాహనాలను ఆపడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది… అలా చేయకుండా, పీక్ అవర్స్ లో ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నం అవ్వాలి. ట్రాఫిక్ అనేది కొంత అవగాహన వల్ల, ఎక్కువ శాతం వాహనదారుల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. వాహనదారుల ట్రాఫిక్ మూవ్ అయ్యే టైం లో పద్ధతిగా వెళ్ళాలి. అన్ని విద్యాలయాలను ఇన్వాల్వ్ చేసి, ముఖ్యంగా పాఠశాలలో ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించాలి.ట్రాఫిక్ ఫరిస్తే ( వాలంటీర్స్ ) లుగా ఉండటానికి ఇంకా చాలా మంది ముందుకు రావాలి… వారి అవసరం సిటీలో ఎంతగానో ఉందని అన్నారు.
విద్యార్థులలో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించి వాటింపైన విద్యాలయాలలో క్యిజ్ లాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం చేయాలి. కార్ పూలింగ్ అనేది వినియోగం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. వేరే సిటిలతో పోల్చి చూస్తే కార్ పూలింగ్ అనేది ఇక్కడ తక్కువ వినియోగిస్తున్నారు. హైదరాబాద్ సిటీ ఎంతో అందమైనది, ఐ.టి. కి క్యాపిటల్ ల చెప్పుకోదగిన సిటీ… కానీ ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని అన్నారు.

Post Midle

Tags: Students should be made aware of traffic rules

Post Midle