విద్యార్థులను పోటీ పరీక్షలకు ఎంపిక చేయాలి

Students should be selected for competitive exams

Students should be selected for competitive exams

Date:16/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పోటీ పరీక్షలకు ఎంపిక చేయాలని ఎంఈవో లీలారాణి ఆదేశించారు. సోమవారం పాఠశాలల హెచ్‌ఎంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఎన్టీఎస్‌ఈ , ఎన్‌ఎంఎంఎస్‌ పోటీ పరీక్షలకు 8, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్కాలర్‌షిప్‌ పరీక్షల్లో తప్పని సరిగా పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. స్కాలర్‌షిప్‌ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు పదోతరగతి స్థాయిలో ఎన్టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ ద్వారా స్కాలర్‌షిప్‌ అందజేయడం జరుగుతుందన్నారు. అందులో ఉత్తీర్ణులైన వారికి పీజిస్థాయి వరకు స్కాలర్‌షిప్‌ లభిస్తుందని తెలిపారు. ఈ విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాలను పొందేందుకు ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు చంద్రయ్య, నాగరాజారెడ్డి, వెంకట్రమణారెడ్డి, బృందాదేవి, సుబ్రమణ్యం, షాకీరున్నిసా, మాదురి తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

Tags: Students should be selected for competitive exams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *