హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉండరాదు

Students should not have any problems at hostels

Students should not have any problems at hostels

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:23/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉండరాదని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ వార్డెన్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఎస్సీ, బీసీ హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పంపిణీ పై పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆదేశాల మేరకు హాస్టళ్లను నిత్యం తనిఖీ చేస్తామన్నారు. హాస్టళ్లలో ఎలాంటి ఇబ్బందులు విద్యార్థులకు కలిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అమ్ము, మేనేజర్‌ వెంకట్రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

వెహోక్కలు నాటారు…

పట్టణంలోని మదనపల్లె రోడ్డులో మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ , కౌన్సిలర్‌ అమ్ము కలసి వెహోక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పట్టణంలో సుమారు 50 వేల వెహోక్కలను నాటామన్నారు. పట్టణాన్ని గ్రీనరీగా మార్చుతామన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకారం అందించాలన్నారు.

 

నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరుస్తాం

Tags: Students should not have any problems at hostels

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *