Students should take Abdulkalam ideally

విద్యార్థులు అబ్ధుల్‌కలామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

– ఎంఈవో కేశవరెడ్డి

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

శాస్త్రవేత్త , మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్ధుల్‌కలామ్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంఈవో కేశవరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలను గూడూరుపల్లె జెడ్పీ హైస్కూల్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సైన్సు పట్ల ఎంతో అవగాహన కలిగి ఉండటం అభినందనీయమన్నారు. సర్‌సీవి రామన్‌ గూర్చి విద్యార్థులు మరింత లోతుగా అధ్యాయనం చేయాలని కోరారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వైజ్ఞానిక రంగాల గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం గురురాజ, ఉపాధ్యాయులు పురుషోత్తంరాజు, రఘు, రాజేష్‌, జివి.రమణ, వేణుగోపాల్‌, న రసింహులు , సీఆర్‌పి శిల్పా తదితరులు పాల్గొన్నారు.

బాలికల హైస్కూల్‌ మరమ్మతులపై మంత్రి పెద్దిరెడ్డికి వినతి

Tags: Students should take Abdulkalam ideally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *