కీవ్ లో చిక్కుకున్న విద్యార్ధులు

అందోళనలో తల్లిదండ్రులు
 
కరీంనగర్ ముచ్చట్లు:
 
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం రెండవరోజుకు చేరుకుంది. భారత విద్యార్దులు అధికాంగా వుంటున్న కీవ్ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారింది. బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేసారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 16 మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు. రామడుగు మండలం రామచంద్రాపురంకు చెందిన సుమాంజలి, ) మెట్ పల్లి కి చెందిన భవానీ,   కరీంనగర్ కట్ట రాంపూర్ కు చెందిన పున్నం శ్రీకాంత్,  మల్యాల మండలం రాంపూర్ కు చెందిన బద్దం నిహారిక,   హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన కేసిరెడ్డి సాయివర్ధన్,  రామడుగు మండలం గోపాల్ రావు పేట కు చెందిన జాలి ప్రణయ్,   సైదాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన సాయినాథ్ రెడ్డి,   సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ కు చెందిన మానస,  హుజురాబాద్ కు చెందిన నిఖిల్ రెడ్డి,  కరీంనగర్ జ్యోతి నగర్ కు చెందిన హారిక,  మేడిపల్లి మండలం మన్నెగూడ కు చెందిన ఉషశ్రీ,  జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన హిమబిందు,  కరీంనగర్ చెందిన రోహిత్,   లలితాదేవి,  గొల్లపల్లి మండలం వెంకటాపూర్ కు చెందిన పడాల పవన్,  సైదాపూర్ మండలం పెరిక పల్లి కి చెందిన పవన్ లు వున్నారు.
మరోవైపు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణా విద్యార్థులకు  సహాయం అందించేందుకు న్యూ ఢిల్లీ తోపాటు తెలంగాణ సెక్రెటేరియట్ లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
 
Tags: Students trapped in Kiev

Leave A Reply

Your email address will not be published.