న్యాయవిద్యను అభ్యసించండి – న్యాయమూర్తి కార్తీక్‌

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులు న్యాయవిద్యను అభ్యసించేందుకు ముందుకురావాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కార్తీక్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజానికి న్యావాదులు ఎంతో అవసరమని కొనియాడారు. చట్టాలను అవగాహన చేసుకుని , న్యాయవాదుల వృత్తిని చదివి , సమాజానికి సేవలు అందించాలని కోరారు. సమాజానికి న్యాయవాదుల అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది వీరమోహన్‌రెడ్డి, అధ్యాపకులు రాజశేఖర్‌, నందీశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Study Law – Justice Karthik

Leave A Reply

Your email address will not be published.