మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

Date:14/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సహా 16మందికి నోటీసులు రావడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినందుకే ఇలాంటి అక్రమ నోటీసులు పంపిచారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. నాన్ బెయిల బుల్ వారెంట్ జారీపై ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ పరోక్షంగా కేసీఆర్ పాత్ర ఉందంటున్నారు. ఎలాంటి కేసులకు భయపడేది లేదంటున్నారు. ఎనిమిదేళ్ల కేసుకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై టిడిపి తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినందుకే ప్రధాని మోడీ రాజకీయ కుట్రలకు దిగుతున్నారని టి టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా బాబ్లీ కేసులు లేవని చెప్పిన నేతలు ఇప్పుడు నాన్ బెయిల బుల్ వారెంట్లు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ పరోక్షంగా సీఎం కేసీఆర్ హాస్తం ఉందంటున్నారు తెలంగాణ టిడిపి తమ్ముళ్లు. బాబ్లీ ప్రాజెక్టు నోటిసులపై కేసీఆర్ స్పందించాలని టి టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఏకంగా 16 మందికి నోటిసులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నోటీసుల అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు టిడిపి నేతలు ప్రయత్నిస్తుంటే జ్యూడిషియరీకి సంబంధించిన నోటీసులకు బిజెపికి లింక్ ఏంటని కమలనాథులు ఎదురుదాడికి దిగుతున్నారు. టిడిపి, బిజెపి నేతలు ఒకరిపై మరోకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూంటే మిగిలిన రాజకీయ పక్షాలు మాత్రం మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నాయి.
Tags:Stupid Telugu mothers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *