డబుల్ రోల్ లో స్టైలిష్ స్టార్

Stylish star in double roll

Stylish star in double roll

Date:15/04/2019
 హైద్రాబాద్ ముచ్చట్లు :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టినరోజు నాడు ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కనబడుట లేదు’ అనేది ట్యాగ్ లైన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆర్య, పరుగు, డీజే’ సినిమాల తర్వాత దిల్ రాజు – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో చిత్రమిది. ‘ఎంసీఏ – మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఫేమ్ వేణు శ్రీరాం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను ప్రకటించిన రోజు టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఈ సినిమాలో నటీనటులు, టెక్నికల్ యూనిట్‌కు సంబంధించి వివరాలేమీ వెల్లడించలేదు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంపై అప్పుడే ఊహాగానాలు, రూమర్లు మొదలైపోయాయి. ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తు్న్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. ఆయన చేయబోయే రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని టాక్. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ, బన్నీ అభిమానులు మాత్రం ఈ వార్త విని ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకు బన్నీ డ్యుయల్ రోల్ చేయలేదు.
2003లో ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించారు. దక్షిణాదిలో స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. కానీ, ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం చేయలేదు. తన తోటి హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లు ఇప్పటికే ద్విపాత్రాభినయం చేశారు. ఎన్టీఆర్ అయితే త్రిపాత్రాభినయం కూడా చేసేశారు. అందుకే, తమ హీరో కూడా డ్యుయల్ రోల్ చేస్తే చూడాలని బన్నీ అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. కాగా, బన్నీకి ఇది 21వ సినిమా. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో 19వ సినిమా, సుకుమార్ డైరెక్షన్‌లో 20వ చిత్రాన్ని ప్రకటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. సుకుమార్ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరవాత ‘ఐకాన్’ మొదలవుతుంది.
Tags:Stylish star in double roll

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *