శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గోన్న సుబ్బారెడ్డి
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో ఆఖరి రోజున టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామీజీ ఆశీస్సులు తీసు కున్నారు.అనంతరం రాజ్యశ్యామల అమ్మవారి యాగంలో పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైవి సుబ్బా రెడ్డి ప్రారంభించారు.అనంతరం మీడి యాతో మాట్లాడుతూ…విశాఖ శ్రీ శార దాపీఠం వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారని,రాజశ్యామల యాగం ప్రసిద్ధిగావించిందని అన్నారు.తిరు మల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లకు పూర్తి సహాయ సహకారాలు అందజేశామని,ముఖ్యంగా ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో కూడా భక్తి భావాన్ని పెంచే విధంగా శారదాపీఠం కృషి చేస్తుందని అన్నారు.ఐదు రోజులపా టు జరిగే రాజ్యశ్యామల యాగం, చతుర్వేద అవనం ఐదు రోజులు పాటు జరిగి పూర్ణాహుతితో ముగింపు జరిగిందని అన్నారు.రాష్ట్రంలో ఉండే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలం దరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగిందని చెప్పారు.
Tags: Subbareddy who participated in the anniversary of Shree Sarada Peetham