ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు      

Date:23/01/2021

దర్శి  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామం లో శనివారం  మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల  నందు సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు ధనిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నకు  ముఖ్య అతిధిగా దర్శి మండల విద్యాశాఖధికారి  కాకర్ల రఘురామయ్య  హాజరై సుభాష్ చంద్ర  బోస్ చిత్ర పటానికి  కి పుష్పములు సమర్పించి ఘనంగా  నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా మాట్లాడు తూ ఇలాంటి వేడుకలు,కార్యక్ర మాల ద్వారా దేశనాయకుల జీవిత చరిత్రలు తెలుపుట వల్ల దేశభక్తి కలిగిన, నిజాయితీ కలిగిన సమాజాన్ని తయారు చేసి భావి తరాలకు అందించాలని ఉద్భోదించారు. కార్యక్రమం నిర్వహించి నoదులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం అనంతరం పాఠశాలలో జరిగిన నాడు- నేడు పనులను నల్లబ ల్లాలు, డ్యూయల్ బల్లలు,టాయిలెట్స్,ఫ్యాన్లు, పాఠశాల ప్రాంగణం సుందరికరణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తి ఐనందున క్లోజింగ్ చేయండని చెప్పారు. ఈకార్యక్రమంలో పోతవరం పంచాయతీ సెక్రటరీ జె. శ్రీనివాసరావు , విద్య సంక్షేమ సహాయకులు,ఉపాధ్యాయులు పి. ఖాసీం, జి. వీరాంజనేయులు, సచివాలయం సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Subhash Chandra Bose Jayanti celebrations in a grand manner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *