సుబ్రహ్మణ్యస్వామి పిటీషన్ తోసిపుచ్చిన సుప్రీం

Subramanian Swamy dismissed the petition

Subramanian Swamy dismissed the petition

Date:17/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
టీటీడీపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయం స్థానిక అంశం కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని.. విచారణ జరపలేమంది. హైకోర్టుకు వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. సుప్రీం కోర్టు పిటిషన్‌ను తిరస్కరించడంపై స్వామి ట్విట్టర్‌లో స్పందించారు.
తిరుపతి విషయంలో తన పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని.. తాను హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఇది శుభ పరిణామన్నారు. టీటీడీ పాలనా నిర్వహణపై సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించే తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఏపీ ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుందని.. విరాళాలు, కానుకల రూపంలో ఆలయానికి ఆదాయం వస్తున్నా ఆడిటింగ్ సరిగా జరగడం లేదని స్వామి ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
Tags:Subramanian Swamy dismissed the petition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *