పుంగనూరు ముచ్చట్లు:
రైతులు నీటిని ఆదా చేసుకునేందుకు బిందుసేద్యంపై అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడిని వినియోగించుకోవాలని ఏడి శివకుమార్ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడితో రూ.2.18 లక్షలకు మించకుండ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. అలాగే పెద్ద రైతులకు 70 శాతం సబ్సిడితో రూ.3.36 లక్షల వరకు సహాయం అందించడం జరుగుతుందన్నారు. స్పింక్లర్ల కోసం 55 శాతం సబ్సిడి ఇస్తామన్నారు. ఇందుకోసం రైతులు తక్షణమే తమ రికార్డులతో సంబంధిత రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు. మండలాల వారి వివరాలు : పుంగనూరు 1400 హెక్టార్లు, సోమల 600 హెక్టార్లు, పెద్దపంజాణి 800 హెక్టార్లు, గంగవరం 600 హెక్టార్లు, చౌడేపల్లె 800 హెక్టార్లు, సదుం 600 హెక్టార్లు, పులిచెర్ల 600 హెక్టార్లు, రొంపిచెర్ల 800 హెక్టార్లలో బిందుసేద్యం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు తక్షణమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏడి కోరారు.
Tags: Subsidy on drip irrigation for farmers