Natyam ad

అసాంఘికకు కార్యాకలపాలుకు అడ్డగా శివారు కాలనీలు

నిజామాబాద్ ముచ్చట్లు:

వరుస హత్యాలతో బెంబేలెత్తున్న ప్రజలు.పదిరోజుల వ్యవధిలో మూడు హత్యలు.పనిపాట లేకుండా జులయ్ గా తిరుగుతూ,డబ్బుల కోసం సైకోగా మారిన యువకుడు,మద్యం మత్తులో ముగ్గురిని హత్య చేసిన సైకో,ఒంటరిగా ఉన్నవారే అతని టార్గెట్.రైల్వేస్టేషన్ల వెంట తిరుగుతూ మద్యానికి బానిస.ఎదుటివారి వద్ద డబ్బులు లాక్కొనేందుకు ఎంతకైనా తెగించ్చేవాడు.తనను ఎవరైనా తిడితే కోపంతో రగిలిపోయి అంతమొందించేవాడు. ఇలా సైకోలా మారిన ఆ యువకుడు మూడు హత్యలు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు వరుస హత్యలపై ప్రత్యేక కథనం.
నిజామాబాద్ జిల్లా డిచి పల్లి మండలం కమలాపుర్ గ్రామం.మహమ్మద్ షారుక్ గ్రామంలో పనిపాట లేకుండా జులాయి గా తిరిగేవాడు.. మద్యానికి బానిస అయిన షారుక్ ఎవరి దగ్గర అయిన డబ్బులు అడుక్కుని త్రాగేవాడు.కల్లు,గంజాయికి అలవాటు పడిన షారుక్ ఇంటివద్ద ఉండేవాడు కాదు.ప్రతిరోజు డిచిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో వచ్చి కల్లు అమ్మే ప్రదేశంలో ఉండేవాడు.వచ్చి పోయేవాళ్ల ను డబ్బులు అతుక్కుని కల్లు త్రాగేవాడు.డబ్బులు లేని సమయంలో కల్లు త్రాగటానికి వచ్చే వారి డబ్బులు దొంగిలించి మరి మద్యం సేవించేవాడు.ఇదే క్రమంలో బంగారు ఆభరణాలు కలిగిన వాలు కనబడిన, డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్లు కనబడిన వారిని వెంబడించి దొంగిలేంచేవాడు..అయితే డిచిపల్లి మండలం లో ఈనెల 5న ఘన్ పూర్ శివారులో నర్సావ్వ అనే వృద్ధురాలు హత్య కు గురి అయింది.పోలీసులు తమదైన స్టయిల్ లో విచారణ చేపట్టారు. కల్లు కాంపౌండ్ నుండి ఆ వృద్దరలిని వెంబడించి న షారుక్ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు..

 

 

అయితే ఆమె వద్ద నున్న డబ్బులు కోసమే ఆమె హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు షారుక్.. అయితే పోలీసులు విచారణలో మరో ఇద్దరిని తానే హత్య చేసినట్టు చెప్పాడు నిందితుడు షారుక్.
మరోవైపు ఆరు నెలల క్రితం ఘన్‌పూర్‌కు చెందిన షేక్‌ మోసిన్‌తో కలిసి జావిద్‌ మద్యం తాగాడు. ఈక్రమంలో మోసిన్‌ అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో జావిద్‌కు విపరీతమైన కోపంతో ఆయనని నెట్టేసి బండరాయితో తలపై మోది చంపేశాడు. పర్సులో ఉన్న రూ.750 ఎత్తుకేల్లి పోయాడు. గతేడాది రైల్వేస్టేషన్‌ పక్కన నిద్రపోతున్న మిట్టాపల్లికి చెందిన మహ్మద్‌ సల్మాన్‌ ఖాన్‌ను బండరాయితో తలపై మోది హత్య చేశాడు.అతని జేబులోని ఐదు వందల రూపాయలు, చేతి గడియారం దొంగిలించానని నేరం ఒప్పుకున్నాడు షారుక్ .దింతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. నిజామాబాద్.

 

 

Post Midle

కూతవేటు దూరంలో రైల్వేస్టేషన్‌తో, జాతీయ రహదారి ఉండడంతో ఈ ఘటన లకు అనువుగా ఉంటోందని, ఈ ప్రదేశంను నేరస్థులు ఎంచుకుంటున్నారు. శివారు కాలనీల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఆప్రాంతాలు మరుగున పడుతూ అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. మరోవైపు శివారులో కాలనీలో సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేసి నేరాలు తగ్గించేందుకు గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు,పోలీస్ లు  చొరవ చూపాలని స్థానికు లు కోరుతున్నారు.

 

Tags: Suburban colonies across the spectrum of informal activities

Post Midle

Leave A Reply

Your email address will not be published.