Natyam ad

పది ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విజయకేతనం

పుంగనూరు ముచ్చట్లు:

పదవ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విజయఢంకా మ్రోగించారు. పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో 227 మందికి గాను 186 మంది ఉత్తీర్ణలైనట్లు ప్రిన్సిపాల్‌ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. వీరిలో ఏఆర్‌.శైలేష్‌ 583, పి.వెంకటేశులు 582, జి.అర్షవర్ధన్‌ 576, ఎ.మోహన్‌కుమార్‌ 574, జి. విజయభాస్కర్‌రెడ్డి 573 మార్కులు సాధించారు. అలాగే మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌లో విద్యార్థులు 77 మంది పరీక్షలకు హాజరుకాగా, 76 మంది పాసైనట్లు ప్రిన్సిపల్‌ రమ తెలిపారు. ఎస్‌.సమీన్‌తాజ్‌ 578 మార్కులు, ఇ.ధరణి 572, ఎ.అక్షయ 571 మార్కులు సాధించారు. అలాగే పట్టణంలోని బీసీ హాస్టల్‌లో 46 మంది విద్యార్థులకు గాను 41 మంది విద్యార్థులు పాసైయ్యారు. మూడే భానుప్రియ 555 మార్కులు, భవ్య 554 మార్కులు సాధించినట్లు సంక్షేమశాఖాధికారి నరసింహులు తెలిపారు. జెడ్పి బాలికల హైస్కూల్‌లో 106 మందికి 92 మంది పాసైనట్లు హెచ్‌ఎం రుద్రాణి తెలిపారు. చంద్రహాసిని 585, కుషిత 582 మార్కులు సాధించారు. అలాగే లీనార్డ్ మున్సిపల్‌ హైస్కూల్‌లో 47 మంది పాసైనట్లు హెచ్‌ఎం ఉషారాణి తెలిపారు. వీరిలో నీతాహారిక 581, కె.పూజారెడ్డి 571 మార్కులు సాధించారు. అలాగే పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మణికంఠ రోహిత్‌ 591, కవిత 590, కుసుమిత లక్ష్మీ 587, వినుత 587, ఖాజల్‌ 580 మార్కులు సాధించారు. అలాగే కృష్ణారెడ్డి శ్రీ చైతన్యలో విద్యార్థులు యశ్వశ్విని 595, జాన్విత 593, జ్ఞానహాసిని 593, కుషిసాయిసత్య 591, రాంకుమార్‌రెడ్డి 593, భావనసాయి 590 అధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు అభినందించారు.

Post Midle

 

Tags; Success factor of government school students in ten results

Post Midle