నియంత్రిత సాగు సక్సెస్

Date:15/08/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నియంత్రిత సాగు లక్ష సాధనలో ప్రభుత్వం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన సాగు లక్ష్యాలకు అనుగుణంగా రైతులు పంటలు వేశారు. సమయానికి పెట్టుబడి సొమ్ము, విత్తనాలు, ఎరువులు అన్నదాతలకు అందుబాటులో పెట్టడంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి 20 లక్షల 33 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలం సీజన్‌కు నిర్ధేశించుకున్న వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం లక్షం కోటి 25 లక్షల 45 వేల ఎకరాలు. అంటే మరో ఐదు లక్షల ఎకరాలు సాగైతే చాలు. వరినాట్లు పూర్తయితే నియంత్రిత సాగు అంచనాలు సంపూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించిన దాని ప్రకారం వరినాట్లు అంచనాలు మించి వేశారు.

 

ఇర ఈసారి వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులకు సూచించింది.దీంతో రైతులు కేవలం 1.93 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. ఇదీ కూడా పశువుల మేత, స్వీట్ కార్న్, పాప్ కార్న్, బేబి కార్న్ వంటి వాటి కోసమే. ఏకంగా 8 లక్షల ఎకరాలు సాగు తగ్గిందని వ్యవసాయ శాఖ పేర్కొంది. మొక్కజొన్న బదులు కంది, పత్తి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇప్పటి వరకు రైతులు 10.14 లక్షల ఎకరాల్లో కంది పంట వేసుకున్నారు. గత ఏడాది సాగు విస్తీర్ణం 7.38 లక్షల ఎకరాలుగా ఉంది. వ్యవసాయ శాఖ మాత్రం నియంత్రిత సాగులో 12.31 లక్షల ఎకరాల్లో కంది పంటను ప్రతిపాదించింది. ఇక అత్యధికంగా సాగైన ప్రధాన పంట పత్తి. ఇప్పటి వరకు దాదాపు 58 లక్షల ఎకరాల్లో వేశారు. గత ఏడాది కంటే దాదాపు 4 లక్షల ఎకరాలు అదనంగా సాగు కావడం విశేషం. అయితే ప్రతిపాదిత సాగు లక్షం మాత్రం 60.16 లక్షల ఎకరాలుగా ఉంది. వరినాట్లు కూడా ఇప్పటి వరకు 42.28 లక్షల ఎకరాల్లో వేశారు. లక్ష్యానికి ఇంకా 52 వేల ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో వివరించింది. వ్యవసాయ శాఖ సాధారణ సాగు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే 28 జిల్లాల్లో వంద శాతం పైగా పంటలు సాగయ్యయాయి.రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి. 14 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరో 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, నిర్మల్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో 219.2 మిల్లిమీటర్ల వర్షం కురవాల్సి ఉంది. బుధవారం నాటికి 82.7 మిల్లిమీటర్ల వర్షానికి గాను 94.1 మిల్లిమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదైంది.

 

నిజామాబాద్ లో 2200 నాటి శాసనాలు

Tags:Success in controlled cultivation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *