పుంగనూరులో ఎంసీవి కళాశాల విజయకేతనం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎంసీవి కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయఢంకా మ్రోగించింది. ప్రిన్సిపాల్ రామకృష్ణ ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థినీలు భవిత ఎంపీసీలో 1000 మార్కులకు గాను 968 మార్కులు సాధించింది. అలాగే శ్రీవిద్య బైపీసీలో 894 మార్కులు, గాయిత్రి సీఈసీలో 923 మార్కులు సాధించారు. అలాగే వెహోదటి సంవత్సరంలో ఎస్.మాలిన్తాజ్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 458 మార్కులు, ఎస్.అంజుమ్ బైపిసీలో 427 మార్కులు, టి.దివ్యశ్రీ సీఈసీలో 475 మార్కులు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు.

Tags: Success of MCV College in Punganur
