విజయవంతంగా చిత్తూరు జిల్లా వైసిపి ప్లీనరీ
పలమనేరు ముచ్చట్లు:
పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం శ్రీ సాయిబాబా ఆలయం & శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాల సమీపంలో నేడు నిర్వహించిన జిల్లా స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నేడు విజయవంతంగా కొనసాగింది.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి , ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు) , ఎంపి రెడ్డప్ప , ఎమ్మెల్యేలు ఎన్.వెంకటేగౌడా , పెద్దిరెడ్డి ద్వారానాథ్ రెడ్డి , అరణి శ్రీనివాసులు , ఎం.ఎస్.బాబు , ఎమ్మెల్సీలు భరత్ , రమేష్ యాదవ్ , పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.అందులో భాగంగా వైఎసార్సిపి-జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలు, అభివృద్ధి గురించి ప్రసంగించారు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాలకు జగనన్న ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు వైకాపా ప్రభుత్వ సేవలను కొనియాడారు.కార్యక్రమంలో డిసిసిబి చైర్ పర్సన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి , టిటిడి డైరెక్టర్ పోకల అశోక్ కుమార్ , పికెఎం-యుడియే చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ , జిల్లా పరిధిలోని వైఎస్సార్సిపి శ్రేణులు, పార్టీ అనుబంధ సంస్ధలు, రైతు విభాగం నాయకులు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, కార్పొరేషన్ చైర్మన్లు, మునిసిపల్ చైర్మన్లు, పార్టీ కన్వీనర్లు, సింగల్ విండో ప్రెసిడెంట్లు, వైస్ ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ నాయకులు, నామినేటెడ్ చైర్మన్లు & వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డ్ సభ్యులు, డైరెక్టర్లు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags:Successful Chittoor District YCP Plenary