వైద్య శిబిరం విజయవంతం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు:

జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో నేత్ర సమస్యతో బాధపడుతున్న జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 13 మంది నిరుపేదలకు ఆపి –  రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలను నేత్ర వైద్యులు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు అవసరమైన శస్త్ర చికిత్సలు వెంటనే చేసుకోవాలని, లేని పక్షంలో కంటి చూపు పోయే ప్రమాదం ఉందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Successful medical camp MLA Dr. Sanjay Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *