జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలను అందరి సమిష్టి కృషి తో విజయవంతంగా నిర్వహణ

-నేడే ఫైనల్ మ్యాచ్ … ఈ కార్యక్రమానికి పలువురు  రాష్ట్ర మంత్రులు రాక
-ఈ క్రీడా స్ఫూర్తిని ఇలాగే కొనసాగి స్తాం
-ప్రో కబడ్డీ పోటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీల నిర్వహణ
-భారతదేశంలో ఇప్పటివరకు కబడ్డీ పోటీలలో రూ. 3 లక్షల 50 వేలు నగదు బహుమతి ఇవ్వడం ఇదే ప్రథమం –  తిరుపతి శాసనసభ్యులు
-అందరి సమిష్టి కృషితో కబడ్డీ పోటీల నిర్వహణ – మేయర్
-ఈ పోటీల నిర్వహణకు తిరుపతిలోని పలు సంస్థలు సహకారంతో పండుగ వాతావరణంలో నిర్వహణ – కమీషనర్
తిరుపతి ముచ్చట్లు:
 
 
జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలను అందరి సమిష్టి కృషి తో విజయవంతంగా పండుగ వాతావరణంలో తిరుపతిలో నిర్వహిస్తున్నామని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఇందిరా మైదానంలో ఈ నెల 5 న ప్రారంభమై 9 వ తేదీ వరకు జరుగుతున్న కబడ్డీ పోటీలలో భాగంగా నాల్గవ రోజైన శనివారం మద్యాహ్నం మీడియా సెంటర్ లో తిరుపతి శాసనసభ్యులు,తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డా.ఆర్. శిరీషా,తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ పి.ఎస్.గిరీషా, లచే విలేఖరుల సమావేశం జరిగింది.ఈ విలేఖరుల సమావేశంలో తిరుపతి శాసనసభ్యులు మాట్లాడుతూ తిరుపతిలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణకు అందరు సమిష్టి కృషి సమన్వయంతో ఒక యజ్ఞం లాగా చేయడం జరిగిందన్నారు. ఈ పోటీలకు సంబంధించి ఈ నెల 9 న ఫైనల్ మ్యాచ్ అని, ప్రో కబడ్డీ తర్వాత భారతదేశంలోనే ఎక్కువ నగదు బహుమతి రూ.3 లక్షల 50 వేలు తుది విజేత అయిన జట్టుకు మహిళలు, పురుషులకు విడివిడిగా అందజేయడం జరుగుతున్నదన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కు  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, గౌ. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ శాఖా మాత్యులు బొత్సా సత్యనారాయణ, టి.టి.డి. చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తుది విజేతకు నగదు బహుమతితో పాటు ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్ పురుషులకు యమహా బైక్ ను, మహిళలకు కేశ్విన్ టివిఎస్ స్కూటి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించి తిరుపతికి సంబందించిన పలు సంస్థలు ప్రతినిధులు అందించిన ఆర్ధిక సహాయంతో పాటు బ్యానర్ల ఏర్పాటు తదితర అంశాలలో వారి సహకారం మరువలేనిదన్నారు. ఈ పోటీలకు సంబంధించి పూర్తిగా ప్రచారాన్ని చేయడంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సహకారం గోపద్దన్నారు. తిరుపతిలో గతంలో తుడా చైర్మన్ గా, టిటిడి చైర్మన్ గా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ క్రీడల నిర్వహణ పెద్ద ఎత్తున చేయడం క్రీడాస్పూర్తిని పెంపొందించడంలో ప్రారంభమని ఈ స్పూర్తిని అందరు పెంపొందించుకోవాలని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి , ఉద్యోగి కష్టపడి పనిచేశారన్నారు.
 
మేయర్ మాట్లాడుతూ జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీల నిర్వహణ అనే ఒక చిన్న ఆలోచనతో ప్రారంభించి ఇంత గొప్పగా కబడ్డీ పోటీల నిర్వహణకు అందరి సహకారంతోనే సాద్యమైనదని ప్రత్యేకంగా నగరపాలక సంస్థ పరిదిలో పనిచేసే కమీషనర్ మొదలు చిన్న ఉద్యోగి వరకు బాగా కృషి చేశారని దీనితో పాటు మీడియా వారి సహకారం మరువలేనిదని అన్నారు.కమీషనర్ మాట్లాడుతూ తిరుపతిలో పండుగ వాతావరణంలో జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణ జరుగుతున్నదని 5 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో నాలుగు రోజులుగా ప్రజలు క్రీడలను తిలకించేందుకు పెద్ద ఎత్తున రావడం జరుగుతున్నదన్నారు. ఇంత పెద్ద ఎత్తున క్రీడల నిర్వహణకు అనుభవం లేకపోయినప్పటికీ తిరుపతి శాసనసభ్యులు సహకారంతో 22 రాష్ట్రాల నుంచి 42 జట్లు పాల్గొనేలా కృషి చేయడం జరిగిందని, ఈ పోటీలకు సంబందిచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియా కుడా పెద్ద ఎత్తున కవరేజ్ చేయడం జరుగుతున్నదని మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణ స్ఫూర్తి తో ప్రతి సంవత్సరం క్రీడాకారులకు ఉత్సా హాన్ని ఇచ్చిన వారమవుతామన్నారు.ఈ విలేఖరుల సమవేశంలో కార్పోరేటర్ లు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Successful organization of National Invitational Kabaddi Competitions with the collective effort of all

Natyam ad