రాజేంద్రనగర్ లో సూడాన్ దేశస్థుడి హత్య

Sudanese national murders in Rajendranagar

Sudanese national murders in Rajendranagar

Date:15/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి పీ అండ్ టీ కాలనీలో అర్థరాత్రి దారుణం  జరిగింది. సుడాన్ దేశానికి చెందిన రాషెష్ అనే యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసారు. ఉన్నతవిద్య కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన రాషెష్ హైదరాబాద్ శివారు గండిపేట మండలం బండ్లగూడ పి అండ్ టి కాలనీలో ఉన్న స్నేహితుల వద్ద ఉంటున్నాడు.
తరుచూ స్నేహితులతో గొడవపడి వారిపై దాడి చేస్తుండడంతో తమ వద్దనుండి బయటకు వెళ్ళగొట్టారు.మంగళవారం తరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో అదే ప్రాంతంలో ఉన్న సూడాన్ దేశస్తునికి చెందిన అబ్దుల్లా అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి అతడితో తగవు పడ్డాడు. మాటామాట పెరిగి రాషెష్ దాడికి దిగడంతో ఆగ్రహంతో అబ్దుల్లా ఇంట్లో ఉన్న కత్తితో రాషెష్ ఛాతిలో పొడిచాడు. దీంతో రాషెష్ అక్కడికక్కడే మృతిచెందాడు.
విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతుడి కి సంబంధించిన ఊరూపేరూ మినహా వేరే ఎలాంటి వివరాలు తెలియదని, పాస్ పోర్టు వీసా కూడా లభించలేదని దీంతో మృతుడు నగరానికి ఎప్పుడు వచ్చాడు అన్న వివరాలు ఏమాత్రం తెలియలేదని పోలీసులు పేర్కొంటున్నారు.
Tags:Sudanese national murders in Rajendranagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *