ఆకస్మికంగా వెనక్కొచ్చేసిన గవర్నర్

Suddenly backed governor

Suddenly backed governor

Date:25/04/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
గవర్నర్‌ నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన గవర్నర్.. ఊహించని రీతిలో పర్యటన మధ్యలోనే వెనక్కి వచ్చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌‌లతో భేటీ అయ్యేందుకు గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు, రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలను కేంద్రం దృష్టికి తేవడం ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశం. కానీ ప్రధానిని కలవకుండానే ఆయన అర్ధాంతరంగా పర్యటన ముగించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.గవర్నర్‌ వ్యవహరిస్తోన్న తీరుపై మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను గవర్నర్ ఏకం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఇదే నిజమైతే నరసింహన్ తీరు సరికాదంటూ ఘాటుగా స్పందించారు. బాబు వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ముగిసిందిసోమవారం విశాఖ పర్యటనకు వెళ్లిన గవర్నర్.. షెడ్యూల్‌లో లేనప్పటికీ.. మార్గమధ్యంలో విజయవాడలో ఆగి చంద్రబాబుతో రెండు గంటలు భేటీ అయ్యారు. అంతకు ముందే రాజ్‌భవన్లో గవర్నర్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.
Tags:Suddenly backed governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *