కాంగ్రెస్ గూటికి సుధాకర్ బాబు

Date:28/10/2020

కర్నూలు  ముచ్చట్లు:

పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్, డీసిసి అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు కాంగ్రెస్  పార్టీ లో చేరారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన సుధాకర్ బాబు ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఇటీవలే ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  సుధాకర్ బాబు తిరిగి పాత గూటికే చేరారు. అయనకు కండుగా వేసి పిసిసి చీఫ్ శైలజానాథ్ అహ్వానించారు.శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలి. తిరిగి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. కోవిడ్  కేసులలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల కమషనర్ నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్రంలో రైతుల మోటర్లకు మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.. బిజెపి మాట జగన్ మాటగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గుడ్డిగా సీఎం జగన్ మద్దతు తెలుపుతున్నారు.. రైతులకు అందాల్సిన సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుంది. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని అన్నారు.

కాంగ్రెస్ నేతపై దాడికి యత్నం

Tags:Sudhakar Babu to Congress Gooty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *