Sudhakarreddy as Principal of the Department

డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌గా సుధాకర్‌రెడ్డి

Date:22/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టి విలేకరులతో మాట్లాడుతూ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కళాశాల సమస్యలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు నాణ్యమైన బోధనను అందించి, అధ్యాపకుల సహకారంతో కళాశాలను ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమూర్తి, అధ్యాపకులు రాఘవరెడ్డి, వెంకటకృష్ణయ్య, హరిప్రసాద్‌లు కలసి నూతన ప్రిన్సిపాల్‌కు స్వాగతం పలికి, సన్మానం చేశారు.

23న వైఎస్సార్‌సీపీ మోటారుసైకిల్‌ ర్యాలీ

Tags: Sudhakarreddy as Principal of the Department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *